నిజమేనా..మోక్షజ్ఞ, ఎన్టీఆర్, బాలయ్య ముగ్గురూ కలసి..!

Tuesday, October 17th, 2017, 10:40:59 PM IST

ఓ వైపు వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్, మరో వైపు బాలయ్య – తేజ కాంబినేషన్ లో రాబోయే ఎన్టీఆర్ బయోపిక్ గురించిన వార్తలు నెట్ వైరల్ గా మారాయి. బాలయ్య లీడ్ రోల్ లో పూర్తి స్థాయి ఎన్టీఆర్ జీవిత చరిత్రని దర్శకుడు తేజ తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ని బాలయ్య పోషిస్తాడు. ఎన్టీఆర్ చిన్ననాటి పాత్రలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞని నటింపజేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మధ్య వయస్కుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇది జరిగితే మాత్రం నందమూరి అభిమానులకు పండగ అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments