అలిపిరి దోషులకు నాలుగేళ్ల జైలు శిక్ష

Thursday, September 25th, 2014, 01:59:18 PM IST


2003వ సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జరిగిన దాడికేసులో తిరుపతి కోర్ట్ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. అలిపిరి బ్లాస్టింగ్ కేసులో రామచంద్రారెడ్డి, నర్సిరెడ్డి మరియు చంద్రలకు కోర్ట్ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా..ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.

2003లో తిరుమల వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కారును బ్లాస్టింగ్ చేసేందుకు నక్సలైట్స్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.. కాగ, ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. కేసు పూర్వాపరాలు విచారించిన కోర్ట్ పై విధంగా తీర్పును ఇచ్చింది.