18 జూన్ `యాత్ర‌`కు జేగంట‌!

Saturday, May 26th, 2018, 11:08:22 AM IST

ఓవైపు 2019 ఎన్నిక‌ల గురించి స‌ర్వ‌త్రా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారి ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ‌నాయ‌కుల బ‌యోపిక్‌లు రిలీజ్ చేయ‌నున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌, వైయస్సార్ బ‌యోపిక్ ఇప్ప‌టికే స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తించాయి. ఈ రెండు బ‌యోపిక్‌లు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. ఓవైపు బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ స‌న్నాహకాల్లో బిజీబిజీగా ఉన్నారు. మ‌రోవైపు మ‌హి.వి.రాఘ‌వ్ వైయస్సార్ బ‌యోపిక్ `యాత్ర‌`కు సంబంధించిన రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు టీమ్‌ని రెడీ చేస్తున్నారు.

జూన్ 18 నుంచి యాత్ర‌ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి 2019 ప్ర‌థమార్థంలో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. వైయ‌స్సార్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లైన వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కోసం న‌టీన‌టుల్ని వెతుకుతున్నారు. తెలుగు న‌టీన‌టులెవ‌రూ ఈ చిత్రంలో న‌టించేందుకు డేర్ చూపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు భాష‌ల నుంచి స్టార్ల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. ఇక ష‌ర్మిల పాత్ర‌లో భూమిక న‌టిస్తోంది అన్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments