`జంగిల్‌బుక్` సీక్వెల్ ట్రైల‌ర్ ధ‌మాకా

Tuesday, May 22nd, 2018, 09:19:07 PM IST

ప్ర‌పంచం విస్తుపోయేలా ఏదైనా చేయ‌డ‌మే ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీ సిద్ధాంతం. చంద‌మామ క‌థల్ని క‌థ‌గా చ‌దువుకుని వ‌దిలేస్తే కిక్కేం ఉంటుంది?. అందుకే చంద‌మామ, బొమ్మ‌రిల్లు, బాల‌మిత్ర క‌థ‌ల్నే ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలుగా తీస్తున్నారు. ఒక అంద‌మైన క‌థ‌ని అంత‌కుమించి అందంగా 3డి, ఐమ్యాక్స్ 3డిలో చూసుకునే భాగ్యం క‌లుగుతోంది. ఐమ్యాక్స్ వంటి చోట్ల ఇలాంటి సినిమాలు చూసిన‌ప్పుడు పూర్తి స్థాయిలో ఆ క‌థ‌లో లీన‌మై ఆడియెన్ తాధాత్మ‌క‌త చెందుతున్నాడు.

గ‌త ఏడాది రిలీజై ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టించింది జంగిల్ బుక్‌. అన‌గ‌న‌గ ఒక అడివి. ఆ అడ‌విలో అహంకారి అయిన మృగ‌రాజు. ఆ మృగ‌రాజు (పెద్ద పులి) మాట‌ను ధిక్క‌రిస్తే ధండ‌న‌. అలాంటి చోట మృగ‌రాజులో ఊహాతీత‌మైన భ‌యానికి కార‌ణ‌మ‌య్యే ఒక అగ్గి పువ్వు. ఆ అగ్గిపువ్వు పుట్ట‌డానికి కార‌కుడైన మ‌నిషి.. అత‌డి వ‌ల్ల అడ‌వుల ధ్వంశం. ప్రాణుల‌కు ప్రాణ‌న‌ష్టం.. ఇవ‌న్నీ ఊహించే మృగ‌రాజు మోగ్లీ అనే కుర్రాడిని చంప‌డానికి చేసే విశ్వ‌ప్ర‌య‌త్నం… వెర‌సి ఓ కొత్త లోకానికే తీసుకెళ్లారు ఈ సినిమాతో. జంగిల్ బుక్ ఇండియా నుంచి ఏకంగా 250 కోట్లు దోచుకెళ్లింది. ఇలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ వ‌స్తోంది అంటే ప్రేక్ష‌కాభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తి. తాజాగా ఈ సీక్వెల్ ట్రైల‌ర్ రిలీజైంది. ఇలా రిలీజైందో లేదో అలా కొన్ని గంట‌ల్లోనే ఈ ట్రైల‌ర్‌ని 32 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈసారి జంగిల్ బుక్ సీక్వెల్‌ని `మోగ్లీ` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మోగ్లీ జంగిల్ బుక్‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి పేరు. తొలి భాగంలో ముగింపులో ఓ చిన్న ట్విస్టు. అగ్ని కీల‌ల‌మ‌ధ్య చిక్కుకున్న పులి రాజు చ‌నిపోయాడా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్‌గా ఉంచారు. ఇక రెండో భాగంలో ఆ పులి ఇంకా ఇంకా ఆక‌లితో రెచ్చిపోతూ క‌నిపించ‌నుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. అంటే మోగ్లీ చిత్రం ఆద్యంతం మృగ‌రాజుతో మోగ్లీ పోరాటం ఉంటుంది. సేమ్ టైమ్ అత‌డు జంగిల్ నుంచి జ‌నార‌ణ్యంలో అడుగుపెట్టాక ఎలాంటి వింతైన ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్‌లో చూపించారు. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. మోగ్లీ పాత్రలో మాష్ట‌ర్‌ క్రిస్టీన్ బాలే న‌టించ‌గా, కీల‌క పాత్ర‌ల‌కు కేట్ బ్లాంకెట్‌, బెనెడిక్ట్ కుంబెర్ బాచ్‌, ఫ్రీదా పింటో త‌దిత‌రులు

  •  
  •  
  •  
  •  

Comments