నారా లోకేశ్‌కు సిగ్గుండాలి.. ఘోరంగా ట్రోల్స్ చేస్తున్న జూనియర్ ఫ్యాన్స్..!

Wednesday, October 9th, 2019, 01:18:30 AM IST

టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల విడుదలయిన సైరా సినిమాపై స్పందిస్తూ తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా సైరా. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారఅంటూ, తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు అంటూ ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డికి, సాంకేతిక సిబ్బంది మరియు చిత్ర యూనిట్ మొత్తానికీ తన ట్విట్టర్ ద్వారా హార్దికాభినందనలు తెలియచేసిన సంగతి తెలిసిందే.

అయితే లోకేశ్ చేసిన ఈ ట్వీట్‌పై ఆయనకు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్ళలో విడుదలయిన జూనియర్ ఎన్‌టీఆర్ సినిమాల గురుంచి ఒక్క సారి అయినా ట్వీట్ చేశారా అంటూ, ఇప్పుడు సైరా సినిమా గురుంచి మాత్రం గొప్ప పొగడ్తలతో ట్వీట్ చేశావని కాస్త సిగ్గుపడాలి అంటూ ఎన్‌టీఆర్ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.