జూనియర్ ఎన్‌టీఆర్ రావాలి.. చంద్రబాబు ఎదుటే తమ్ముళ్ళ స్లోగన్స్..!

Friday, February 26th, 2021, 04:54:45 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. అయితే చంద్రబాబు రోడ్ షో శాంతిపురం వరకు రాగానే కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్‌టీఆర్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూనియర్ ఎన్‌టీఆర్‌ను తప్పకుండా కుప్పంకి తీసుకువచ్చి ప్రచారం చేయించాలని డిమాండ్ చేశారు. అయితే తమ్ముళ్ల స్లోగన్స్ విన్న చంద్రబాబు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే సైలెంట్‌గా ముందుకు కదిలారు.

మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఈ సారి చంద్రబాబు, ఎన్‌టీఆర్ కలిపి ఉన్న ప్లెక్సీలను కూడా కుప్పంలో అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కొందరు జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులు మాత్రం పాలిటిక్స్‌లోకి వెళ్ళకండంటూ, ఈ రొచ్చులో దిగి మాకు దూరం కావద్దంటూ ట్విట్టర్ ద్వారా ఎన్‌టీఆర్‌కు సూచనలు ఇస్తున్నారు.