ట్రైలర్ : భయాన్ని చూపిస్తోన్న డైనోసార్లు

Monday, April 16th, 2018, 06:59:55 PM IST

ఇస్లా నబ్లర్‌ దీవిలోని భారీ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో డైనోసార్లుకు ముప్పు కలుగుతుంది. ఆ కఠిన ప్రమాదం నుంచి డైనోసార్ల జాతిని హీరో ఏ విధంగా రక్షించాడు? అనేది ఒక కథ. ఈ నేపథ్యంలో వస్తోన్నదే జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌’. 2015లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ‘జురాసిక్‌ వరల్డ్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమాకు సంబందించి 30 సెకన్ల ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు వచ్చిన డైనోసార్ సినిమాలు మంచి అడ్వెంచర్ హిట్స్ అనిపించాయి. కానీ సినిమాలో డైనోసార్స్ మాత్రం చాలా బయపెట్టనున్నాయట. ట్రైలర్ చూస్తుంటే హారర్ చిత్రంలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జె.ఏ.బెయోనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 22న రిలీజ్ కానుంది. క్రిస్‌ ప్రాట్‌, బ్రెసీ డల్లాస్‌ హోవర్డ్‌, బి.డి.వాంగ్‌ వంటీ స్టార్ యాక్టర్స్ సినిమాలో కనిపించనున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు స్పీల్‌ బర్గ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తోన్న ఈ సినిమాను యూనివర్సల్‌ పిక్చర్స్‌, ది కెనడీ మార్షల్‌ కంపెనీ, అంబ్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లెజండరీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments