జురాసిక్ వరల్డ్ 1000 కోట్ల టార్గెట్!

Friday, June 1st, 2018, 08:27:43 PM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒక సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌ డమ్‌’ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. 2015 లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌ సినిమాకు ఇది కొనసాగింపు గా రానుంది. ఇకపోతే మొదట జూన్ 6న బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, కొరియా, ఫిలిప్పీన్స్‌‌ దేశాల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా జూన్‌ 7న ఇండియా మరియు క్రొయేషియా, హాంగ్‌కాంగ్‌ వంటి దేశాల్లో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపోతే అన్ని దేశాల్లో కంటే కాస్త ఆలస్యంగా ఈ సినిమా జూన్ 22న అమెరికాలో విడుదల కానుంది. అయితే అక్కడ విడుదలైన మొదటి వారంలోనే సినిమా రికార్డులు సృష్టించడం కాయమని టాక్ వస్తోంది. 150 నుంచి 160 మిలియన్ల డాలర్లను (ఇండియన్ కరెన్సీ లో 1000 కోట్లు) రాబట్టగలదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ముందుగా వచ్చిన జురాసిక్ వరల్డ్ రిలీజ్ అయిన మొదటి వారంలోనే 208 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌ డమ్‌’ కోసం కూడా జనాలు ఎగబడతారని ప్రస్తుతం మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.