టీజ‌ర్ మెరుపులు : జురాసిక్ వ‌రల్డ్ 2

Friday, May 25th, 2018, 10:00:03 AM IST

క్రియేటివిటీలో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అత‌డు డైనోసార్ల సృష్టిక‌ర్త‌. డైనోసార్ల‌తో సినిమాలు తీసి వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్న లెజెండ్‌. అత‌డు స్వ‌య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `జురాసిక్ పార్క్‌` సిరీస్ ఏ స్థాయి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు స్పీల్ బ‌ర్గ్ నిర్మిస్తూ.. అత‌డి శిష్యుడు జె.ఎ.బ‌యోనా తెర‌కెక్కించిన `జురాసిక్ వ‌ర‌ల్డ్ : ఫాలెన్ కింగ్ డ‌మ్‌` జూన్ 22న వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు వేడి పెంచుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌ను చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది. వీట‌న్నిటికీ అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఈ వేస‌వి సెల‌వుల‌కు పిల్ల‌లు కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల‌కు విచ్చేసేందుకు ఆస్కారం ఉన్న ఏకైక సినిమా జారాసిక్ వ‌ర‌ల్డ్ 2. ఈ చిత్రం ఇండియాలోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టి దాదాపు 300 కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ లో హార‌ర్ .. టెర్ర‌ర్‌.. భ‌యం అనేవి ఎలా ఉంటాయో ఎలివేట్ చేశారు. డైనోసార్‌తో మ‌నిషి ప్ర‌యోగాలు విక‌టిస్తే ఆ ప‌రిణామం అంతే కొత్త‌గా ఉంటుంద‌న్న ఆస‌క్తిక‌ర పాయింట్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జూన్ 22.. ఆ రోజు స్పీల్ బ‌ర్గ్ అభిమానుల‌కు, ప్ర‌పంచ సినీవీక్ష‌కుల‌కు 2డి, 3డిలో టెర్ర‌ర్ పండుగే.

  •  
  •  
  •  
  •  

Comments