న్యూ ట్రైల‌ర్ : జురాసిక్ వ‌ర‌ల్డ్ భీభ‌త్స‌భీతావ‌హం

Saturday, April 28th, 2018, 05:10:48 PM IST

2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా `జురాసిక్ వ‌ర‌ల్డ్‌- ఫాలెన్ కింగ్‌డ‌మ్` పేరు మార్మోగిపోతోంది. జూన్ 22న 2డి, 3డిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ క్ర‌మంలోనే వ‌ర‌ల్డ్‌వైడ్ జురాసిక్ పార్క్ సిరీస్‌, స్పీల్‌బ‌ర్గ్‌ వీరాభిమానులు ఎంతో ఉత్క ంట‌తో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు ఇప్ప‌టికే అభిమానుల్లో అంచ‌నాల‌ను మించి వేడి పెంచాయి. ముఖ్యంంగా డైనోసార్ వ‌ర‌ల్డ్‌లో కొత్త వింత‌ల్ని స్పీల్ బ‌ర్గ్ – బ‌యోనా బృందం ఈ సినిమాలో చూపించ‌బోతోంది. అండ‌ర్ వాట‌ర్ రాక్ష‌స‌బ‌ల్లి విహారం, పోరాటాల్ని సినిమాలో ప్ర‌త్యేకంగా హైలైట్ చేస్తూ కొన్ని భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తీర్చిదిద్దామ‌ని ఇదివ‌ర‌కూ ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు. ఆ క్ర‌మంలోనే అవ‌స‌రం మేర రీషూట్ల కోసం ప్ర‌ఖ్యాత క్రిస్టోఫ‌ర్ నోలాన్ క్రియేటివిటీని స్పీల్‌బ‌ర్గ్ బృందం ఉప‌యోగించుకుంద్న ప్ర‌చారంతో మ‌రింత హీట్ పెరిగింది. ఇటీవ‌లే చిత్ర‌బృందం రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

తాజాగా మ‌రో ట్రైల‌ర్‌ని జారాసిక్ వ‌ర‌ల్డ్ బృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ ఆద్య ంతం గ‌గుర్పొడిచే విన్యాసాల‌తో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ముఖ్య ంగా డైనోసార్‌ని ఈ విజువ‌ల్స్‌లో చాలా క్లోజ్‌గా వీక్షించే వెసులుబాటు ఉండ‌డంతో మ‌రింత‌గా భ‌య‌పెట్టేస్తోంది. స్పీల్‌బ‌ర్గ్‌- ఎ.బ‌యోనా- క్రిస్టోఫ‌ర్ నోలాన్ మేధోత‌నం- క్రియేటివిటీ అణువ‌ణువునా క‌నిపిస్తున్నాయ‌నడంలో స‌దేహం లేదు. ఇక `జురాసిక్ వ‌ర‌ల్డ్ -ఫాలెన్ కింగ్‌డ‌మ్‌` చిత్రం అమెరికా స‌హా వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌లో స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్‌, అవెంజ‌ర్స్ 2, బ్లాక్ పాంథ‌ర్‌, అవ‌తార్ రికార్డుల్ని వేటాడ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments