సూపర్ స్టార్ అభిమానిగా .. జ్యోతిక ?

Friday, May 11th, 2018, 10:09:13 AM IST

జ్యోతిక .. కోలీవుడ్ లో సంచలన నటిగా ఇమేజ్ తెచ్చుకున్న నటి. ప్రస్తుతం సూర్య ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన జ్యోతిక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గట్టుగా తల్లి .. అక్క పాత్రల్లో నటిస్తూ వస్తున్నా ఆమె తాజాగా ఓ రీమేక్ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ రజని కాంత్ కు వీర అభిమానిగా కనిపిస్తుందట. కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పిందట జ్యోతిక. మగవాళ్లే కాదు హీరోలంటే పిచ్చి అభిమానమున్న ఆడవాళ్లు ఉంటారు .. ఈ సినిమా ఒరిజనల్ మలయాళంలో మోహన్ లాల్ అనే సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. మళయాళంలో ఘాన విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు మంచి సందేశంతో ఈ సినిమా ఉంటుందంట. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పింది జ్యోతిక.