షాక్ … బాలయ్య సినిమాకు దర్శకుడు మారాడు?

Sunday, February 19th, 2017, 02:28:29 PM IST


ఈ సంక్రాంతి కి ”గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాతో మంచి హిట్ అందుకున్న బాలయ్య, ఆ ఊపుతో స్పీడ్ పెంచాడు ? ఇప్పటికే అయన 101 వ సినిమాకోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణవంశీ ”రైతు” సినిమాకోసం సన్నాహాలు చేస్తుండగా, మరో వైపు పూరి జగన్నాధ్ కూడా ”ఎన్టీఆర్” కథతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు వినాయక్? లేటెస్ట్ గా మెగాస్టార్ తో ”ఖైదీ నంబర్ 150” తో వందకోట్ల మార్కెట్ ను సాధించిన వినాయక్, నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. ఇప్పటికే బాలయ్యతో వినాయక్ కథ చర్చలు జరుపుతున్నాడు? ఇదిలా ఉంటె ఇప్పుడు బాలయ్య 101 వ సినిమా చేయడానికి మరో దర్శకుడు ప్లాన్ చేసాడు ? చేయడమే కాదు త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందట? అవునా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి !! ఇంతకీ ఎవరా దర్శకుడు అనేగా మీ డౌట్ ? అయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ? ఇప్పటీకే బాలయ్యతో రవికుమార్ కథ కూడా వినిపించాడని, పక్కా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని, కథ నచ్చిన బాలయ్య ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ? రజనీకాంత్ , కమల్ హాసన్, చిరంజీవి లతో సూపర్ హిట్ చిత్రాలను తీసిన రవికుమార్ తో సినిమా చేయడానికి బాలయ్య కూడా ఆసక్తి గ ఉన్నట్టు తెలుస్తోంది. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.