కళాతపస్వి బయోపిక్ సెట్స్ పైకి ?

Saturday, July 28th, 2018, 12:00:28 PM IST

తాజగా తెలుగులో మరో బయోపిక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్న ఎన్టీఆర్, వై ఎస్ బయోపిక్ యాత్ర, పుల్లెల గోపీచంద్ బయోపిక్ రూపొందుతున్నాయి. తాజాగా మరో క్రేజీ దర్శకుడి బయోపిక్ సెట్స్ పైకి రానుంది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు తెలుగు తెరపై అద్భుత చిత్రాలను ఆవిష్కరించిన కళాతపస్వి కె విశ్వనాధ్ ది. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు విశ్వ దర్శనం అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజగా ఈ సినిమా పూజ కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వనాద్ పాత్ర ఎవరు పోషిస్తారా అన్న విషయం పై ఆసక్తి నెలకొంది. 1965 లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విశ్వనాధ్ ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. అయన తీసిన శంకరాభరణం ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతుంది. సిరిసిరి మువ్వా, సాగర సంగమం, సప్తపది, శుభలేఖ, స్వాతికిరణం, స్వయం కృషి లాంటి సినిమాలు తెలుగు సినిమా క్లాసిక్ చిత్రాలుగా మిగిలాయి.

  •  
  •  
  •  
  •  

Comments