అతను ఒక చరిత్ర హీనుడు – కేఏ పాల్ సంచలన వాఖ్యలు

Saturday, December 14th, 2019, 06:07:19 PM IST

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’… కాగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా ఘాటుగా స్పందించారు. కాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం, అన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టెల ఉందని వాఖ్యానించిన పాల్… ప్రజల మధ్యన గొడవలు రేకెత్తించేలా ఈ చిత్రం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇకపోతే కానీ కొన్ని వివాదల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ద్వారా గొడవలు జరగనున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా విషయంలో చివరికి తుది గెలుపు తమదే అని వాఖ్యానించిన కేఏ పాల్, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, కనీసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా మారక పొతే మాత్రం ఇక ఎప్పటికీ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని తీవ్రమైన విమర్శలు చేశారు.