పనికిమాలిన సలహాలతో సీఎం జగన్ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడు – కేఏ పాల్

Sunday, May 2nd, 2021, 12:00:08 AM IST

ఏపీలో ఓ పక్క రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా నేపధ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నా, ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి తీరుతామని తెల్చి చెప్పడంతో పాటు, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను కూడా చేస్తుంది. అయితే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ ప్రస్తుతం దేశంలో డేంజర్ పరిస్థితి నెలకొందని, కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సీఎం జగన్ పనికిమాలిన సలహాలు తీసుకుని తన భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారని పాల్ అన్నారు. సోమవారం కోర్టు తీర్పు ఖచ్చితంగా రద్దు చేయాలని వస్తుందని అంతవరకు తనను చంపిన ఇక్కడే దీక్ష చేస్తానని పాల్ స్పష్టం చేశారు. నేను గతంలో ఉపవాస దీక్షలు చేశానని, నా గురించి ఏమి భయపడక్కర్లేదని అన్నారు. తన బీపీ, షుగర్ లెవెల్‌ బాగానే ఉన్నాయని పరీక్షలను వాయిదా వేస్తే నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తానని సీఎం జగన్‌కు పాల్ చెప్పుకొచ్చాడు.