కాలా ప్రీరిలీజ్ బిజినెస్ 230 కోట్లు

Thursday, June 7th, 2018, 02:12:59 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్ ఎన్న‌డూ లేనంత దారుణ‌మైన సంపులో ఉంది. క‌బాలి త‌ర‌వాత అత‌డి ప‌రిస్థితి ట్రేడ్‌లో మ‌రింత దిగ‌జార‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. మ‌రోవైపు ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వేళ రాజ‌కీయ క‌క్ష‌లు అత‌డిని మ‌రింత‌గా షంటేస్తున్నాయి. ఓ ర‌కంగా రాజ‌కీయాలు ర‌జ‌నీ మెడ‌కు గుదిబండ‌లా త‌గులుకున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితిలో ఉండ‌గానే అత‌డు న‌టించిన కాలా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. క‌ర్నాట‌క మిన‌హా ఈ సినిమా అన్నిచోట్లా ఘ‌నంగా రిలీజైంది. అయితే కాలా రిపోర్ట్ ఏంటి? అంటే .. ఒక్కోచోట ఒక్కోలా టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే తెలుగులో డివైడ్ టాక్ వినిపిస్తోంది. అభిమానులు బావుంద‌ని కితాబిస్తుంటే, కాలా స్లోమోష‌న్ సినిమా అన్న నెగెటివ్ రిపోర్ట్ అందింది.

ఇక‌పోతే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత వ‌సూలు చేస్తే బ‌య్య‌ర్లు, పంపిణీదారులు సేఫ్ అయిన‌ట్టు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎన్నో ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య రిలీజైనా కాలా బిజినెస్ మాత్రం తీసిక‌ట్టుగా ఏం లేదు. కాలా బిజినెస్ వివ‌రంలోకి వెళితే.. త‌మిళ‌నాడు – 60 కోట్లు, ఏపీ, నైజాం-33కోట్లు, కేర‌ళ – 10 కోట్లు, ఇండియాలో ఇత‌ర చోట్ల -7 కోట్ల మేర బిజినెస్ సాగించింది. ఓవ‌ర్సీస్ 45 కోట్ల బిజినెస్ క‌లుపుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా 155కోట్ల ప్రీరిలీజ్ థియేట్రిక‌ల్‌ బిజినెస్ చేసింది. దీంతో పాటు…. శాటిలైట్ హ‌క్కులు 70 కోట్లు, ఆడియో ఇత‌ర‌త్రా బిజినెస్ 5కోట్లు అద‌నం. కర్నాట‌క రిలీజైతే మ‌రో 20 కోట్లు క‌లిసొచ్చేది. మొత్తానికి ఓవ‌రాల్‌గా 230 కోట్ల బిజినెస్ పూర్తి చేసింది. అంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఆమేర‌కు నెట్ వ‌సూళ్లు లేదా షేర్ వ‌సూలు చేయాల్సిందే. దాదాపు 300 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌గ‌లిగితేనే బ‌య్య‌రుకు లాభం వ‌చ్చిన‌ట్టు. లేదంటే యావ‌రేజ్ కిందే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments