కాలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్ ట్విస్ట్‌

Thursday, May 24th, 2018, 02:27:21 PM IST

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కాలా చిత్రం జూన్‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా స‌న్నాహాలు చేస్తోంది యూనిట్‌. కాలా త‌మిళ ప్ర‌మోష‌న్స్‌తో పోలిస్తే తెలుగు ప్ర‌మోష‌న్స్ జీరో స్టేజ్ లో ఉండ‌డంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈనెల 29న హైద‌రాబాద్‌లో ప్లాన్ చేశార‌ట‌. ఈ ఈవెంట్‌కి సూప‌ర్‌స్టార్ విచ్చేస్తారా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే ట్విస్ట్‌. 29వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి హైద‌రాబాద్ నోవాటెల్‌లో ఈవెంట్ సంద‌డిగా సాగ‌నుందిట‌. ఆ మేర‌కు వెన్యూ క‌న్పామ్ అయ్యింది.

ర‌జనీ, నానా ప‌టేక‌ర్ కీల‌క‌పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందిట‌. ముంబై మురికివాడ‌ల్లో తమిళ తంబీల్ని కాపాడే కాలా క‌రికేయుని క‌థేంటో తెరపైనే చూడాలి. అత‌డు ప్రజాసేవ‌కుడా? మాఫియా డాన్‌నా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. 2.ఓ నిర్మాణ‌సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments