ముఖం చాటేస్తున్న‌ మంత్రులు..ఎంసెట్-2 లీక్ ఎఫెక్ట్‌?

Saturday, September 17th, 2016, 01:24:05 PM IST

kadiyam-srihari
తెలంగాణ ఎంసెట్-2 లీక్ వ్వ‌వ‌హారం టీ- మంత్రుల‌ను కుదిపేసింది. విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి, ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి పై అనుమానాలు వ్య‌క్తం అయిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు బ్రోక‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నా దీని వెనుక ఉన్న అస‌లు హీరోలు ఎవ‌ర‌న్న‌ది ఇంకా ద‌ర్యాప్తు జ‌రుగుతూనే ఉంది. నిందితులు ఎవ‌రైనా విడిచి పెట్టేది లేద‌ని కేసీఆర్ ఇప్ప‌టికే అల్టిమేటం జారి జేశారు. దీంతో ఎంసెంట్ -3 వ్వ‌వ‌హారంలో విద్యాశాఖ‌, ఆరోగ్య శాఖలు త‌ల దూర్చలేదు. ఎంసెంట్-3 ప‌రీక్ష రోజును కోడ్ విడుద‌ల మంత్రుల చేతుల మీదుగా జ‌ర‌గ‌డం అన‌వాయితీ. కానీ ఈసారి ల‌క్ష్మారెడ్డి, శ్రీహ‌రి ముఖం చాటేసిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల రిలీజైన ప‌రీక్ష ఫ‌లితాల స‌మ‌యంలో కూడా మంత్రులు జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జెఎన్ టీయూ అధికారులు స‌ద‌రు మంత్రులు కోసం భారీగా ఎంట్రీ ఎర్పాట్లు చేసినా హ‌జ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది. దీంతో లీక్ ఎఫెక్ట్ ఆ ఇద్దరు మంత్రుల‌పై బాగానే ప్ర‌భావం చూపిన‌ట్లు ఉంద‌ని టీ-ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు.