సీఎం పీఏ గురువు అనుప‌మ్ ఖేర్‌?

Wednesday, April 11th, 2018, 11:53:27 PM IST

మ‌హేష్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో నాయిక‌గా న‌టించింది కైరా అద్వాణీ. మ‌హేష్ సీఎంగా న‌టిస్తే, అత‌డి పీఏ పాత్ర‌లో కైరా న‌టించింది. `ఎంఎస్ ధోని` చిత్రంలో న‌టించినా, అధికారికంగా టాలీవుడ్ ఎంట్రీ మూవీ ఇదే. అందుకే టాలీవుడ్‌ కెరీర్ తొలి సినిమా రిలీజ్ వేళ కాస్తంత ఉద్వేగంగా క‌నిపిస్తోంది కైరా. భ‌ర‌త్‌ రిలీజ్ ముంగిట .. త‌న గురువును త‌లుచుకుని ఎమోష‌న్ అయ్యింది.

నేను ఈ స్థాయికి రావ‌డానికి, ఈ అవ‌కాశం ద‌క్కించుకోవ‌డానికి కార‌ణం మీరే.. అంటూ త‌న న‌ట‌శిక్ష‌ణ గురువు అనుప‌మ్ ఖేర్‌ని త‌లుచుకుంది. ఖేర్ నిర్వ‌హిస్తున్న‌ యాక్ట‌ర్ ప్రిప‌రేట‌ర్ సంస్థ‌లో శిక్ష‌ణ పొందిన కైరా త‌న సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. దీపిక ప‌దుకొన్‌, విద్యాబాల‌న్‌, హృతిక్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ వంటి గ్రేట్ స్టార్స్‌ని తీర్చిదిద్దిన ఈ సంస్థ నుంచి వ‌చ్చిన తార‌గా కైరా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మే 1 నుంచి అనుప‌మ్ కేర్ ఇనిస్టిట్యూట్ యాక్ట‌ర్‌ప్రిపేర్స్‌లో కొత్త బ్యాచ్ కి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఔత్సాహికులు చేర‌వ‌చ్చు.

  •  
  •  
  •  
  •  

Comments