అయ్యో .. కాజల్ ఫాన్స్ కిది నిజ్జంగా బ్యాడ్ న్యూసే !!

Wednesday, September 28th, 2016, 01:22:10 AM IST

kajal
అవునా … ఇంతకి ఎం జరిగింది ? అని షాక్ అవ్వకండి .. ? ఇంతకీ విషయం ఏమిటంటే .. ఇప్పటికే తనదైన గ్లామర్ తో కుర్రకారుతో పాటు అందరిని కట్టి పడేస్తున్న హాట్ భామ కాజల్, వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతుంది. అయితే త్వరలోనే కాజల్ పెళ్లి చేసుకుంటుందట !! ఈ మాట ఆమె స్వయంగా చెప్పడం విశేషం !! ఎంత హీరోయిన్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండమంటారా !! ఏమిటి ? అని అనుకోకండి. ఇప్పటికే కాజల్ అంటే పడిచచ్చే ఫాన్స్ లిస్ట్ చాలా పెద్దదే, అలాంటి కాజల్ పెళ్లి చేసుకుంటే వారి పరిస్థితి ఏమిటో ? ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ఈ భామ మాట్లాడుతూ .. ఇప్పటికే పెళ్లి చేసుకోమని ఇంట్లో తెగ ఫోర్స్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ మాట వినాలని ఫిక్స్ అయ్యాను, అందుకే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా అంటూనే .. కాస్త గ్యాప్ ఇచ్చి అదికూడా మరో రెండేళ్ల తరువాత అని చెప్పింది !! ఇప్పటికే ఈ భామ తన చెల్లి పెళ్లి దగ్గరుండి చేసింది, సో కాజల్ మరో రెండేళ్లలో పెళ్ళికి సిద్ధం అయినట్టే కదా !! కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ సరసన ”ఖైదీ నంబర్ 150” వ సినిమాలో నటిస్తుంది.