కాజల్ ని మోసం చేసిన హీరో ఎవరు..?

Thursday, September 29th, 2016, 03:15:23 PM IST

kajal
కాజల్ అగర్వాల్ .. ఈ మధ్యనే పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ అంటూ తాను హీరోయిన్ గానే కాదు పక్కా లోకల్ ఐటెం గర్ల్ గా కూడా ఆదరగొట్టగలను అని ప్రూవ్ చేసుకుంది. సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ రేంజ్ కోసం కష్టపడుతున్న కాజల్ ఈ మధ్యన ఒక హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన లగ్జరీ కారునీ తన డబ్బునీ కూడా ఒకప్పుడు చాలా తేలికగా వాడుకున్న ఒక హీరో ఆమెని సడన్ గా దూరం పెడుతున్నాడు అని బాధ పడిపోతోంది ఆమె. ఎప్పటికప్పుడు ప్లాపులలో మునుగుతూ ఉన్నా కూడా కాజల్ కి అవకాశాల వెల్లువ మాత్రం తగ్గడం లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ – బ్రహ్మోత్సవం లాంటి వరస ప్లాపులతో ఇక అమ్మడి బండి షెడ్ కి చేరుకుంది అనుకున్న టైం లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడం , పార్టీలకి వెళ్ళడం లో బిజీ గా ఉండే కాజల్ తన స్నేహితుల దగ్గర ఒక హీరో గురించి ఫిర్యాదు చేస్తూ వాపోయింది అంటున్నారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈమె షాహిద్ గురించే ఈ కంప్లైంట్ లు చేస్తోంది అంటున్నారు. కొత్త సినిమా కథల టైం లో విపరీతంగా చనువు గా ఉన్న షాహిద్ ఆ తరవాత ఆమెని పట్టించుకోవడం లేదట. ఆమెతో క్లోజ్ గా ఉన్న టైం లో తన లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడుకున్నాడట. అయితే చివరికి సినిమా తెరకెక్కకుండా కథా చర్చల సమయంలోనే చతికిల పడింది. సినిమా ఆగిపోయిన తరవాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అని కాజల్ సీరియస్ గా బాధపడుతోందట. కనీసం ఫోన్, మెస్సేజ్ లాంటివి కూడా చెయ్యని షాహిద్ సైలెంట్ అయిపోయాడు అని తన సన్నిహితుల దగ్గర వాపోతోంది అని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments