ఆ ఛాన్స్ లకు నో చెబుతున్న కాజల్ ?

Friday, September 16th, 2016, 12:37:17 PM IST

kajal-new
గ్లామర్ భామ కాజల్ అగర్వాల్ ఏ క్షణంలో హాట్ హాట్ గా ఆ ఐటెం సాంగ్ చేసిందో గాని ఆ పాటకు మంచి అభినందనలు రావడమే కాదు .. వరుసగా ఆమెకు అలాంటి చాన్సులే వస్తున్నాయట !! ఎన్టీఆర్ నటించిన ”జనతా గ్యారేజ్” లో నేను పక్కా లోకల్ అంటూ ఈ భామ రెచ్చిపోయి చేసిన ఐటెం సాంగ్ అందరిని ఆకట్టుకుంది, దాంతో కాజల్ కు హీరోయిన్ గా కంటే కూడా ఐటెం సాంగ్ చేయమని అవకాశాలు ఎక్కువయ్యాయట !! ఎదో రొటీన్ గా కాకుండా ఉంటుందని, పైగా ఎన్టీఆర్ , కొరటాల శివలతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం అలా ఓ సాంగ్ చేస్తే, అన్ని అలాంటి చాన్సులే రావడం ఏమిటి ? అని షాక్ అవుతుందట కాజల్. ఒక్క తెలుగులోనే కాదండోయ్ .. కోలీవుడ్ నుండి కూడా ఇలాంటి చాన్సులే రావడంతో షాక్ అయినా ఈ భామ ఇకపై నో ఐటెం సాంగ్స్ అని గట్టిగానే చెబుతుందట. ఇస్తే గిస్తే హీరోయిన్ ఛాన్స్ ఇవ్వండి కానీ ఐటెం సాంగ్స్ మాత్రం చేయనని తెగేసి చెబుతుందట. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ సరసన ఖైదీ నంబర్ 150లో నటిస్తుంది.