అమ్మో.. చిరంజీవి మోస్ట్ రొమాంటిక్ ఫెల్లో : కాజల్

Monday, April 9th, 2018, 03:56:19 PM IST

సాధారనంగా చాలా మంది హీరోయిన్లకు హీరోల మీద ఏదో ఒక అభిప్రాయం ఉండే ఉంటుంది. ఒక్కొక్కోల్లు ఒక్కో విధంగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. అయితే హీరోల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల్ని దాచుకోకుండా ఓపెన్ గా చెప్పడం క్యుట్ డార్లింగ్ కాజల్ స్టయిల్. తమిళ హీరో విజయ్ కు అస్సలు టేస్ట్ లేదని, ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో చాలా వీక్ అంటూ గతంలో ప్రకటించి దుమారం రేపింది ఈ అందాల సుందరి. అయితే ఇటివల ఈ భామ కొందరి హీరోల లక్షణాల గురించి, తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చింది. “నా దృష్టిలో మోస్ట్ రొమాంటిక్ హీరో చిరంజీవి మాత్రమే. నేను చాలామంది హీరోలతో కలిసి నటించాను కానీ చిరంజీవి మాత్రం చాలా ప్రత్యేకం, ఆయనంత రొమాంటిక్ గా ఇప్పటివరకూ నాకు ఎవరూ కనిపించలేదు. ఇక నేను వర్క్ చేసిన హీరోల్లో సైలెంట్ అండ్ డీసెంట్ పర్సన్ మహేష్ బాబు. మ్యాగ్జిమమ్ కామ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. ఎవ్వరితోను ఎక్కువ మాట్లాడాడు. మాట్లాడితే మాత్రం జోకులు పేలుస్తుంటాడు.”

ఓ అవార్డు ఫంక్షన్ లో ఇలా చిరంజీవి, మహేష్ బాబుపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది కాజల్. ఇదే ఫంక్షన్ లో ఫ్యాషన్స్ ఫాలో అవ్వడంలో అల్లు అర్జున్ ను మించినోడు లేడని మెచ్చుకుంది. ఇండస్ట్రీలో తనను పడేయాలని ఎవరూ ప్రయత్నించలేదని, అయితే హీరో నవదీప్ మాత్రం 2-3 సార్లు ఆ పని చేశాడని కానీ ఆయన తరం కాలేదని తన అభిప్రాయాన్ని తెలియజేసింది కాజల్ అగర్వాల్.

  •  
  •  
  •  
  •  

Comments