ఫెస్టివల్ హీరోకు కాజల్ ఒకే చెప్పేసిందట?

Sunday, April 8th, 2018, 04:39:07 PM IST

టాలీవుడ్ లో ఫెస్టివల్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమా కోసం ప్రస్తుతం చాలానే కష్టపడుతున్నాడు. తన సక్సెస్ రెంటింగ్ ఏ మాత్రం కిందకు జారకుండా తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఒకే చేస్తూ కెరీర్ ను ఒక లెవెల్ లో సెట్ చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం శర్వా సుదీర్ వర్మ డైరెక్షన్ లో ఓక ప్రాజెక్టును స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సినిమాలో కళ్యాణి ప్రియదర్శినిని కూడా ఒకే చేశారు. అలాగే కాజల్ కూడా సినిమాలో మరొక పాత్ర చేస్తోందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇటీవల కాజల్ స్పందించినట్లు తెలుస్తోంది. శర్వానంద్ 28వ సినిమాలో నటిస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి న్యూస్ వెలువడలేదు. ఇంకా టైటిల్ నిర్ణయించలేని ఈ ప్రాజెక్ట్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.