మిస్టర్ మజ్ను కోసం కాజల్ రంగంలోకి?

Thursday, September 13th, 2018, 01:42:26 PM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అఖిల్ చాలా ఆశలుపెట్టుకున్నాడు . ఎందుకంటే ఇప్పటికే అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది . ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన హలో యావరేజ్ గా నిలవడంతో సరియన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మరో క్రేజీ భామ కాజల్ కూడా ఈ సినిమాలో కీ రోల్ లో కనిపిస్తుందట. కాజల్ ఈ సినిమాలో నటిస్తుందన్న విషయం సర్వత్రా ఆసక్తి నేలకెత్తింది. అన్నట్టు ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేసేలా ఉన్నారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments