కాజల్ రెమ్యునరేషన్ డబుల్ అయ్యిందా?

Tuesday, November 7th, 2017, 07:36:46 PM IST

ప్రస్తుతం సౌత్ లో కాజల్ హవా మళ్లీ మొదలైందని చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా కాజల్ తన అందాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోని కాజల్ నటించేసింది. ముఖ్యంగా మెగా హీరోలందరితోని కాజల్ స్క్రీన్ షేర్ చేసుకోంది. తెలుగులో ఖైదీ నెంబర్ 150 అలాగే రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ అందుకున్న కాజల్ రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ ‘మెర్సల్’ తో మరో భారీ హిట్ అందుకోంది. దీంతో అమ్మడు రెమ్యునరేషన్ ని డబుల్ చేసేసిందట. మొన్నటి వరకు కోటికి దగ్గరలో అడిగిన కాజల్ ఇప్పుడు ఆ సంఖ్యను పెంచేసిందని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ని పెంచడానికి ఇదే సరైన సమయమని ఈ చందమామ భామ డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం అమ్మడి వయసు మూడు పదులు దాటేసింది. దీంతో మంచి అవకాశాలను దక్కించుకొని మరికొన్నేళ్ల వరకు కెరీర్ ను కొనసాగిచాలని ఆలోచిస్తుందట.

  •  
  •  
  •  
  •  

Comments