ఎన్టీఆర్ కోసం పక్కా లోకల్ పాపను దింపుతున్నారు ?

Sunday, May 27th, 2018, 09:42:45 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం గ్లామర్ భామ .. అదికూడా పక్కా లోకల్ భామను దింపుతున్నారు ? పక్కా లోకల్ భామ ఎవరనే షాక్ అవుతున్నారా .. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ .. పక్కా లోకల్ .. నేను పక్కా లోకలు .. అంటూ చిందేశిన హాట్ భామ కాజల్ ? ఆ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది .. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా ఆమెతోనే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఈ పాటను ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరిస్తారట. సో మొత్తానికి ఎన్టీఆర్ కోసం కాజల్ మరోసారి ఐటమే గర్ల్ గా మారుతుందన్నమాట !!

  •  
  •  
  •  
  •  

Comments