మాస్ రాజా సరసన మరోసారి కాజల్ ?

Thursday, June 7th, 2018, 04:05:09 PM IST

అందాల చందమామ కాజల్ కు ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గాయి. ఈ మధ్య వరుసగా పరాజయాలు రావడంతో కొత్త అవకాశాలు రావడం లేదు. ఇక తమిళంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. అందుకే కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు మళ్ళీ వరుస పెట్టి సినిమాల్లో బిజీ అయ్యేందుకు సిద్ధం అయింది. తాజగా మాస్ రాజా రవితేజ సరసన నటించేందుకు ఓకే చెప్పిందట . ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలపడం విశేషం. ఓ ఇంటర్వ్యూ లో కాజల్ మాట్లాడుతూ తెలుగులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న అమర్ అక్బర్ ఆంటోని తో పాటు తమిళ తేరి రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నేను నటిస్తున్నాను అంటూ చెప్పింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుంది. ఇందులో మరో హీరోయిన్ గా కేథరిన్ ను ఎంపిక చేసారు. తమిళంలో సమంత చేసిన పాత్రలో కాజల్ నటించనుంది. ఇప్పటికే రవితేజ సరసన రెండు సినిమాల్లో నటించిన కాజల్ కిది మూడో సినిమా. ఈ సినిమాతో అటు సంతోష్ శ్రీనివాస్ కూడా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments