కాజల్ కూడా ఆ హీరోకి ఓకె చెప్పేసిందా..!!

Sunday, February 4th, 2018, 01:33:53 PM IST

జయాపజయాలు ఎలా ఉన్నా బెల్లం కొండ శ్రీనివాస్ భారీ చిత్రాలు మాత్రం ఆగడం లేదు. వరుసగా భారీ చిత్రాలు క్రేజీ కాంబినేషన్లతో బెల్లం కొండ శ్రీనివాస్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత, రకుల్ వంటి స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ పండించిన బెల్లం కొండా శ్రీనివాస్ ప్రస్తుంతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన డీజే హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ శ్రీనివాస్ తో రొమాన్స్ కు సై అన్నట్లు తెలుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ నానితో శ్రీనివాస్ తదుపరి చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వరుసగా స్టార్ హీరోయిన్లతో నటిస్తున్నా శ్రీనివాస్ అదృష్టం మాత్రం మారడం లేదు..చూద్దాం ఈ యువహీరోకి కాజల్ కలసి వస్తుందో లేదో !