ఆడియో సాంగ్స్ : కాలా ఆడియో పాటలు దుమ్ము లేపాయిగా..

Wednesday, May 9th, 2018, 11:38:25 AM IST

క‌బాలి త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రం కాలా. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్‌ 7న విడుద‌ల కానుంది. చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో ఈ రోజు సాయంత్రం గ్రాండ్ ఆడియో వేడుక జ‌ర‌పనున్నారు. అయితే కొద్ది సేప‌టి క్రితం సంతోష్ నారాయ‌ణ్ స‌మ‌కూర్చిన స్వ‌రాల‌ను యూ ట్యూబ్ ద్వారా విడుద‌ల చేశారు. ఇవి సంగీత ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. చిత్రంలో మొత్తం 8 పాట‌లు ఉండ‌గా, వాటిని హ‌రిహ‌ర‌సుధ‌న్, సంతోష్ నారాయ‌ణ్‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, ప్ర‌దీప్ కుమార్‌, అనంతు, యోగి బి,, అరుణ్ రాజా కామరాజు, రోష‌న్ జామ్‌రాక్‌, ఢీ, డోపియాడెలిజ్ మ‌రియు ముత్తామిల్ పాడారు. క‌బిల‌న్‌, ఉమాదేవి, అరుణ్‌రాజా కామ‌రాజ్ మ‌రియు అరివు పాట‌ల‌కి లిరిక్స్ అందించారు. కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. .వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ కాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్న ఆడియో వేడుక‌లో ర‌జనీకాంత్ త‌న పార్టీకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

  •  
  •  
  •  
  •  

Comments