కాలా కి లైన్ క్లియర్!

Tuesday, June 5th, 2018, 06:44:11 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా సినిమా ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అసలైతే ఈ సినిమా గత కొన్ని రోజుల క్రితమే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడాల్సి వచ్చింది. ఫైనల్ గా సినిమా ఈ గురువారం విడుదల కానుంది. అయితే కర్ణాటకలో విడుదలకు అడ్డంకులు రావడం కాస్త అనుమానాలను రేపింది. మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే రూమర్స్ వచ్చాయి. కావేరి నది జలాల విషయంలో రజినీకాంత్ చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా కర్ణాటకలో కొందరు ఆందోళనకారులు సినిమా విడుదలను అడ్డుకుంటామని చెప్పారు. అయితే చిత్ర నిర్మాత ధనుష్ హై కోర్టును ఆశ్రయించడంతో థియేటర్స్ లిస్ట్ ఇస్తే వాటికి సెక్యురిటి ఇప్పించడానికి సిద్ధమని కోర్టు విచారణ అనంతరం తీర్పును ఇచ్చింది. దీంతో కర్ణాటక రజిని ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సంబరాలు మొదలుపెట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments