రజినీకాంత్ మార్కెట్ పడిపోయిందా?

Saturday, May 12th, 2018, 10:34:09 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినీకాంత్ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ చిత్రాలు నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను అందించాయి. ఓ విధంగా చెప్పాలంటే శ్రీమంతులను చేశాయని చెప్పవచ్చు. అయితే రజినీకాంత్ గత కొంత కాలంగా విజయాలు అందుకోవడం లేదు. చివరగా రోబో తప్పితే మారే సినిమా పెద్దగా మెప్పించలేదు. కొచ్చడియాన్ – లింగా మరియు కబాలి సినిమాలు అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని అందుకోలేదు. అప్పుడు బయ్యర్లు చాలానే నష్టపోయారు. అయినా కూడా సూపర్ స్టార్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చింది.

తెలుగులో రజినీ కాంత్ డబ్బింగ్ సినిమాలకు మార్కెట్ బాగానే ఉంది. కానీ రాబోయే కాలా సినిమాకు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రజినీ గత సినిమాలు తెలుగులో భారీ రేటుకు కొనగా బయ్యర్లను తీవ్రంగా నష్టాలకు గురి చేశాయి. దీంతో కాలా సినిమాకు తెలుగు హక్కులకు 40 కోట్లు చెబుతుండగా కొనడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. 2.0 సినిమా 80 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. దీంతో కాలా కి కలిసొస్తుందని 40 కోట్లకు ఫిక్స్ చేయగా కొనడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. శంకర్ కాబట్టి ఆ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హిట్టు కాకపోయినా మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. హిట్ అయితే ఇక లాభాలు అందుతాయి. కానీ ఇంతకుముందు కబాలి ఇచ్చిన నష్టాలకు బయపడి ఎవ్వరు కొనడానికి దైర్యం చేయడం లేదు. 20 కోట్లకు ఫిక్స్ చేసిన కాలా రైట్స్ అమ్ముడుపోవడం అనుమానంగానే ఉందని టాక్ వస్తోంది.