కబాలిని మించలేకపోయిన కాలా ?

Saturday, June 9th, 2018, 11:19:20 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఎన్నో అంచనాలతో భారీగానే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కేవలం 50 కోట్ల వసూళ్లను రాబట్టింది . సూపర్ స్టార్ స్టామినా .. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రజని కబాలి వసూళ్లను అధిగమించలేకపోయింది. కబాలి మొదటి రోజు ఏకంగా 87. 5 కోట్లను వసూలు చేసి సంచలనం రేపింది. ఇక కాలా చిత్రం మొదటి రోజు వసూళ్లను చుస్తే .. తమిళనాడులో 17 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు, కేరళ – 3 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో – 6 కోట్లు, ఓవెర్సెస్ లో 17 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి 50 కోట్లను మాత్రమే రావట్టింది. ఇక సక్సెస్ విషయంలో కూడా భిన్నమైన టాక్ వినిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments