మెగాఅల్లుడు సైలెంట్ ఎంట్రీ.. హిట్ కొడతాడా?

Tuesday, June 12th, 2018, 12:14:01 PM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి యువ హీరోల చాలా మంది వచ్చారు. అయితే ఎవరికీ వారు వారి సొంతంగా ఎదగడానికి ట్రై చేసి సక్సెస్ అందుకున్నారు. మొదటి సినిమాలకైతే సాధారణంగా మెగా స్టార్ల నుంచి మంచి మద్దతు లబిస్తుంటుంది. కానీ వారి రిలేషన్ నుంచి వస్తున్న చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మాత్రం సింపుల్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎక్కువగా హంగామా లేకుండా సోలో ప్రమోషన్స్ తో ముందుకు వెళుతున్నాడు. రీసెంట్ విడుదలైన విజేత టీజర్ ఆకట్టుడుకుంటోంది.

సింపుల్ గా ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ తో వస్తున్న కళ్యాణ్ దేవ్ ఓ వర్గం వారిని థియేటర్స్ వరకు రప్పిస్తాడనే చెప్పాలి. అయితే ముందు నుంచి మెగాస్టార్ కూడా మెగా బ్రాండ్ ఎక్కువగా వాడకూడదని దర్శక నిర్మాతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అందుకే కళ్యాణ్ ఇప్పటివరకైతే మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి మద్దతు అందుకోలేదు. మరి ముందు ముందు ఏమైనా ప్రమోషన్స్ కోసం వాడతాడో లేదో చూడాలి.