ఫస్ట్ లుక్ : నవ్వుతూ ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు

Saturday, May 26th, 2018, 06:06:49 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో యువ హీరో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమా ద్వారా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే విషయం పై అనేక అనుమానాలు వచ్చినప్పటికీ ఫైనల్ గా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరిని ఆకర్షించింది. ఈ సినిమా ఫాదర్ – సన్ సెంటిమెంట్ తో నడుస్తుందట. కళ్యాణ్ ఫాదర్ గా మురళి శర్మ నటించనున్నారు. జత కలిసే సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా రాకేష్ శశి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments