తమ్ముడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ?

Wednesday, June 6th, 2018, 11:07:55 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అన్న నందమూరి కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తమ్ముడికోసం కళ్యాణ్ రామ్ జై లవకుశ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలోనే మరో సినిమాకూడా నిర్మించనున్నాడు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకున్నాడు .. ఈ సందర్బంగా అన్న కళ్యాణ్ రామ్ ఓ లక్సరీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట .. దాంతో పాటు దానికి అదిరిపోయేలా నంబర్ కూడా రిజిస్టర్ చేయించాడట. ఇంతకీ ఆ కార్ ధర ఏంతో తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలట ? ఆ గిఫ్ట్ చూసి ఎన్టీఆర్ కూడా షాక్ అయ్యాడట. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న నా నువ్వే చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments