హరికృష్ణ పాత్రలో .. కళ్యాణ్ రామ్ ?

Saturday, September 15th, 2018, 10:50:13 PM IST


నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా ఎన్టీఆర్ – చంద్రబాబు లకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా జాయిన్ కానున్నాడు .. అయన ఇటీవలే మరణించిన హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఎల్లుండి నుండి ఈ పాత్రకు సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఎన్టీఆర్ రామారావు రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణది కీలక పాత్ర. చైతన్య రధాన్ని హరికృష్ణ నడిపి ఎన్టీఆర్ ని ప్రజల దగ్గరికి చేర్చాడు. ఈ సినిమాకోసం కళ్యాణ్ రామ్ 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. మొత్తానికి ఈ బయోపిక్ సినిమాలో పలువురు క్రేజీ నటీనటులను ఎంపిక చేసి బాలయ్య భారీ హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. బాలీవుడ్ నటీమణి విద్యా బాలన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments