డబ్బింగ్ లో దూసుకుపోతున్న మెగాస్టార్ మెగా అల్లుడు

Thursday, May 17th, 2018, 04:45:19 PM IST

అంచెలంచెలుగా మెగా ఫ్యామిలీలో నుండి ఒక్కొక్కరూ సినీ ప్రపంచానికి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే కోవలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, తన చిన్న కూతురు అయిన శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ కూడా తెరంగేట్రం చేసిన సంగతి విదితమే. కళ్యాన్ దేవ్ కథానాయకుడిగా, ఎవడె సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే లాంటి హిట్టు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన నటి మాళవికా నాయర్ కథానాయికగా ఓ సినిమా జనవరి 31 నాడు ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ముహూర్తం అయిన వెనువెంటనే సెట్స్ పైకి వెళ్లిపోయి చక చకా షూటింగ్ చివరి షెడ్యుల్ వరకు పూర్త్య్హి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ వరకు వచ్చింది.

ప్రస్తుతానికి ఒక సింగల్ షెడ్యుల్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం కళ్యాన్ దేవ్ తన సినిమాకి తానె డబ్బింగ్ చెప్పుకుంటానని డబ్బింగ్ పని మొదలు పెట్టాడు. ఇటివల అతను చేస్తున్న డబ్బింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కాలేజ్ కథాంశంతో మంచి లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫాస్ట్ లుక్ త్వరలోనే సినీ అభిమానుల ముందుకు రానున్నదని దర్శకుడు రాకేశ్ శశి అన్నాడు. బాహుబలి చిత్రాన్ని తన కెమెరాలో బందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ సినిమాకి డీఓపీ గా పనిచేయగా రంగస్థలం చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న రామ కృష్ణ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం గమనార్హం. సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న ఈ మెగా అల్లుడు ఎలా రెచ్చిపోతాడో రెచ్చిపోతాడో వేచి చూడాల్సిందే.