ప‌వ‌ర్‌స్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీపై క‌మ‌ల్ కామెంట్‌?

Wednesday, September 27th, 2017, 08:10:33 PM IST

పొలంలో విత్త‌నాలు చల్లి రైతులా ఎదురు చూసే బాప‌తు కాదు నేను! బుర్ర‌లో గింజ ప‌డ్డాక‌, మొల‌కెత్త‌డానికి సెక‌న్లు చాలు.. నిమిషాల్లో మొక్క మొలిచి రిజ‌ల్ట్ తేలిపోవాల్సిందే. ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాల ప‌రిస్థితి ఇలా ఉంది. పొలంలో రైతులా ఎదురు చూసే స‌న్నివేశం లేద‌క్క‌డ‌. నేరుగా సీఎం అయిపోయేందుకు కాకుల్లా కాచుక్కూచున్నారు మంది జ‌నం. అందులో సెల‌బ్రిటీలూ వెయిటింగ్‌. కొడ్తే కుంభాన్ని కొట్టేయాల‌న్న క‌సి సినీహీరోల్లో క‌నిపిస్తోంది. అవ‌కాశం కోసం చ‌కోర‌ప‌క్షుల్లా ఎదురు చూస్తున్నారంతా. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ స‌హా విజ‌య్‌ లాంటి హీరోలు త‌మిళ రాజ‌కీయాల్లో ఆ ఒక్క ఛాన్స్ కోసం ఆస‌క్తిగానే ఎదురు చూస్తున్నారు. చిన్న స్థాయిలోనే అయినా విశాల్ సైతం రేసులోనే ఉన్నాడు. మ‌రి వీళ్ల‌లో భ‌విష్య‌త్ సీఎం ఎవ‌రో.. ఎప్ప‌టికి తేల్తుందో కానీ.. జ‌నాల్లో మాత్రం టాపిక్ ర‌స‌ప‌ట్టులో సాగుతోంది. వేడెక్కిస్తోంది. అయితే ఈ హీరోలంతా క‌లిసి ఒకే తాటిపైకి వ‌చ్చి క‌లిసి ఒకే పార్టీ పెట్టుకుని ప‌ని చేయొచ్చు క‌దా? అంటూ జ‌నాల మైండ్‌లో సందేహం. ఇదే మాట‌ క‌మ‌ల్‌హాస‌న్‌ని అడిగితే .. అద‌స్స‌లు కుదిరే ప‌నే కాద‌ని తేల్చేశాడు. ర‌జ‌నీకాంత్ భావ‌జాలం వేరు.. నా భావ‌జాలం వేరు.. క‌మ‌లానికి ద‌గ్గ‌ర‌గా ర‌జ‌నీ భావ‌జాలం ఉంటే నేను మాత్రం ప్ర‌జ‌ల మ‌నిషిగా ఉంటానంటూ ఏవేవో చెప్పాడు.

త‌మిళ‌నాడు ప‌వ‌ర్‌స్టార్‌ విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అంద‌రికీ పోటీనిస్తే ఏం చేస్తారు? అని ప్ర‌శ్నిస్తే క‌మ‌ల్ ఇచ్చిన ఆన్స‌ర్ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉంది. తొలుత విజ‌య్‌ ఎజెండా ఏంటి అన్న‌ది ప‌రిశీలించి, మాకు ద‌గ్గ‌ర‌గా ఉంటే సోదరుల్లా స‌పోర్ట్ చేస్తాం. మా విజ‌న్‌కి వ్య‌తిరేకంగా ఉంటే విమ‌ర్శిస్తాం! అంటూ సూటిగా చెప్పేశారు. క‌మ‌ల్ హాస‌న్‌లోని ఈ దూకుడు చూస్తుంటే అన్నంత ప‌నీ చేసేట్టే ఉన్నాడు. ఇలాంటి దూకుడుతో అంద‌రినీ క‌లుపుకుపోవ‌డం ఎంత‌వ‌ర‌కూ కుదురుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments