బ్రేకింగ్ న్యూస్ : రజిని ని దాటేసిన కమల్

Monday, April 9th, 2018, 03:43:19 PM IST

ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చాలు. ఆయన చరిష్మా, క్రేజ్, సరైన సినిమా పడితే ఆయనకు వచ్చే కలెక్షన్ల స్టామినా ముందు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరు నిలవలేరు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ విషయమై పలుమార్లు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, షారుఖ్, సల్మాన్ వంటి నటులు తాము ఎంత పేరుసంపాదించినా రజిని ముందు నిలువలేము అని పలు సందర్భాల్లో చెప్పడం చూసాము. అలానే ప్రస్తుతం వున్న తమిళ సినీ పరిశ్రమలో రజినీకి పోటీగా నిలబడగల వ్యక్తి కేవలం కమల్ అనే చెప్పుకోవాలి. కాకపోతే ఒక్కమాటలో చెప్పాలంటే రజిని తర్వాతే కమల్ అని చెప్పక తప్పదు. సినిమాల్లో రజనీ తర్వాతే తన స్థానమని కమల్ హాసన్ కూడా ఒప్పేసుకుంటారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందనేది కొందరి అభిప్రాయం.

అమ్మ మరణం తర్వాత సామాజిక అంశాల మీద గళం విప్పటం మొదలెట్టారు కమల్ హాసన్. ఇందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నారు. వివిధ అంశాల మీద తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా వెల్లడించటంతో పాటు, తనకేం అనిపించిందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేయటంతో ఆయన తీరు గడిచిన కొంతకాలంగా పలువురిని ఆకర్షిస్తోంది. ఇదే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీ ఇమేజ్ ను కమల్ క్రాస్ చేసేలా కనిపిస్తోంది. అయితే, ఇదంతా సినిమాలకు సంబంధించి కాదనుకోండి, సోషల్ మీడియాకు సంబంధించి. రజనీతో పోలిస్తే కమల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో కమల్ ఖాతాకు 46.95 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా రజనీ ట్విట్టర్ ఖాతాకు 46.15 లక్షల మంది మాత్రమే ఫాలో చేస్తున్నారు.

రజనీతో పోలిస్తే కమల్ ఎప్పటికప్పుడు ట్వీట్లతో చురుగ్గా ఉండటంతో పాటు తరచూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే పోస్టులు పెట్టటం వల్ల తలైవా వెనుకబడి ఉంటారని చెబుతున్నారు. ఏమైనా, సిల్వర్ స్క్రీన్ మీద రజనీని బీట్ చేసే వారు లేనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆయన్ను ఆయన చిరకాల స్నేహితుడే క్రాస్ చేయటం విశేషం. అయితే రజనికి సోషల్ మీడియా పట్ల అంత ఆసక్తి వుండదని కాబట్టే ఆయనకు ఫాలోయర్స్ అంత తక్కువ వున్నారు అనేది మరికొందరి వాదన…….

  •  
  •  
  •  
  •  

Comments