షాకింగ్ : కమల్ -గౌతమి లని విడగొట్టింది రమ్యకృష్ణ ??

Wednesday, November 9th, 2016, 06:10:36 PM IST

ramya-krishna
కమల్ హాసన్ – గౌతమిల మధ్యన దాదాపు 13 సంవత్సరాలుగా సాగిన సహజీవనం ముచ్చట మొన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియా సినిమా వర్గాల్లో ఈ వ్యవహారం ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిన విషయమే. గౌతామి క్యాన్సర్ బారిన పడినప్పుడు వెన్నంటే ఉంది చూసుకున్నాడు కమల్ కూడా కానీ సడన్ గా ఏమైందో ఏమో తెలీదు కానీ వీరిద్దరూ విడిపోయారు. కారణాలు తెలియని సందర్భం లో వీరి బ్రేక్ అప్ కి కారణం అంటూ శృతి హాసన్ పేరు వినపడింది. కమల్ – గౌతమి కలిసి ఉండేందుకు అస్సలు ఇష్టపడని శృతి ..గౌతమితో పలుసార్లు విబేధించేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా కమల్ – శృతి కలిసి నటిస్తోన్న ‘శభాష్ నాయుడు’ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో వీరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడం..ఈ విషయంలో కమల్ శృతికి సపోర్ట్ చేయడంతో గౌతమి తీవ్రంగా హర్ట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే ఈ బ్రేకప్ విషయంలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ సరసన నటిస్తోన్న రమ్యకృష్ణకు గౌతమికి కూడా గొడవ జరిగిందట. గౌతమి డిజైన్ చేసిన ఓ కాస్ట్యూమ్ ను వేసుకోవడానికి రమ్య ఒప్పుకోలేదట. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కమల్..గౌతమిని కాకుండా రమ్యకే సపోర్ట్ చేశాడట.