రండి.. నన్ను చంపండి..నేనే గెలుస్తాను : కమల్ హాసన్

Wednesday, November 15th, 2017, 06:51:08 PM IST

తమిళ రాజకీయాల్లో వచ్చే ఎలక్షన్స్ ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో గాని వివాదాలు మాత్రం తార స్థాయిలో ఉంటాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధమవుతోంది. ఇప్పటికే అక్కడి అధికార ప్రభుత్వం చాలా భయంతో ఉంది. ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పటి నుంచి అక్కడి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే ప్రస్తుత సినీ నటులు కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఏ మాత్రం తడబడకుండా ఓపెన్ గా రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు.

పార్టీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇకపోతే కమల్ తరచు సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై స్పందించి వివాదాస్పదం చేసుకుంటాడు. రీసెంట్ గా హిందూ ఉగ్రవాదం అని కామెంట్ చేయడం దేశమంతటా సంచలనంగా మారీన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది కమల్ కు వ్యతిరేకంగా ఓ ఇద్దరి పిల్లల చేతికి కత్తి ఇచ్చి కమల్ పోస్టర్ పై పొడవండని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అయితే ఇది కమల్ హాసన్ వరకు చేరడంతో..ఈ ప్రకృతి నన్ను చంపేస్తుంది. కానీ నన్ను అంత కంటే ముందే చంపే హక్కు మీకే ఉంది. చంపడానికి ప్రయత్నించండి. నేను తప్పకుండా గెలుస్తాను అంటూ కమల్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. అయితే కమల్ కు మద్దతుగా అభిమానులు అలాగే కొంత మంది నటి నటులు నిలిచారు.

  •  
  •  
  •  
  •  

Comments