రెండో భారతీయుడు కోసం సీరియస్ గా ఉన్న కమల్ ?

Saturday, February 24th, 2018, 04:01:56 PM IST

జాతీయ నటుడు కమల్ హాసన్ తాజాగా రాజకీయ పార్టీని స్తాపించినా విషయం తెలిసిందే. ప్రస్తుతం అయన సినిమా కెరీర్ సాఫీగా సాగడం లేదు కాబట్టే రాజకీయాల్లోకిఇ వచ్చాడని అనుకుంటున్నారు జనాలు. ఇక కమల్ కు ఇప్పుడు మరింత క్రేజ్ తప్పకుండ అవసరం ఉంది .. అందుకోసమే అయన నేటి రాజకీయ నేపథ్యంలో భారతీయుడు 2 సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు ఓ సంచలనం .. దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత దానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు శంకర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. ఈ సీక్వెల్ లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తాడట. రాజకీయాల నేపథ్యంలో రూపొందే ఈ సినిమాతో ప్రజల్లో మరింత క్రేజ్ తెచ్చుకునే దిశగా ప్లాన్ చేస్తున్నాడు కమల్. మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు.