అక్కడలేని దేశభక్తి థియేటర్స్ లోనే ఎందుకంటున్న కమల్ ?

Wednesday, October 25th, 2017, 11:00:37 AM IST

సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం ప్రదర్శించడం పై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు కూడా థియేటర్స్ లో జాతీయ గీతం ఆలపించడం అవసరమా అన్న ఆలోచనలో పడింది… ఈ విషయం పై అందరు స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది. ఎంటర్టైనమెంట్ కోసం వచ్చే వారు దేశభక్షి ని చాటుకోవలసిన అవసరం ఏముంది? ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ లాంటి వాటిల్లో లేని రూల్ థియేటర్స్ లోనే ఎందుకు అనే విషయం పై తాజాగా జాతీయా నటుడు కమల్ హాసన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. థియేటర్స్ లో జాతీయ గీతాన్ని ప్రదర్శించడం సరికాదని అంటున్నాడు కమల్ హాసన్. ఈ మద్య తమిళ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న కమల్ పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు క్రియేట్ చేస్తున్నారు. థియేటర్స్ లో జాతీయ గీతం ప్రదర్శించడం సరైన నిర్ణయం కాదని, సింగపూర్ లాంటి దేశాల్లో ప్రతిరోజు టీవీల్లో ఓ ప్రత్యేక సమయంలో ప్రసారం చేస్తారని, అలాగే దూరదర్శన్ లో కూడా అలా ప్రసారం చేయడం బెటరని, జాతీయ గీతం వస్తే తాను లేచి నిలుచుంటానని అన్నారు. అంతే కానీ వినోదం కోసం వచ్చిన వాళ్ళను ఇలా దేశభక్తి ని చాటుకోమనడం సమంజసం కాదని అన్నారు. అలాగే ఈ విషయం పై మరో నటుడు అరవింద్ స్వామి కూడా స్పందించి .. థియేటర్స్ లో జాతీయ గీతం ఎందుకు వినిపిస్తారని, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి వాటిలో రోజు ఎందుకు ప్రదర్శించారు అంటూ ఘాటుగానే స్పందించారు.