ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్న కమల్ ?

Thursday, September 27th, 2018, 02:47:05 PM IST

జాతీయ నటుడు కమల్ హాసన్ ఎన్నో ఆశలు పెట్టుకుని విశ్వరూపం 2 తీవ్రంగా నిరాశ మిగిల్చింది. ఈ సినిమా పై ఎన్నో ఆశలు, ఎంతో ఖర్చు పెట్టి మరి తెరకెక్కించాడు. విడుదలైన అన్ని భాషల్లో రిజల్ట్ ఒకేలా ఉండడంతో అయన నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే అయన తెరకెక్కించిన శబాష్ నాయుడు విడుదల కాకుండా ఆగిపోయింది. అందుకే మళ్ళీ సరైన సినిమా చేసి మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. భారతీయుడు 2 సినిమా అమెరికా నేపథ్యంలో ఉంటుందని. ఈ సినిమా విడుదలకు ఎలాగూ రెండేళ్లు పట్టొచ్చు కాబట్టి ఈ లోగా మంచి కమర్షియల్ ఫ్యామిలీ సినిమాకోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అందుకనే 1992లో వచ్చిన తేవర్ మగన్ ( క్షత్రీయ పుత్రుడు ) కు సీక్వెల్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడట. కుటుంబ నేపథ్యంలో గ్రామా కక్ష్యలు, కార్పణ్యాలతో సాగిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం కాబట్టి ఆ సినిమా చేస్తే మళ్ళీ ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరావొచ్చన్నది అయన ప్లాన్. అందులో కమల్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. బారు మీసాలు .. పంచె కట్టు .. సో త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.