విశ్వరూపం-2, శభాష్ నాయుడుకి కమల్ హసన్ మోక్షం!

Tuesday, September 26th, 2017, 11:22:20 AM IST


ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న ఓ రెండు సినిమాలు ఇప్ప‌టికీ లైట్ చూడ‌క‌పోవ‌డంపై సౌత్ ఇండ‌స్ట్రీస్ స‌హా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. రెండేళ్ల క్రిత‌మే పూర్త‌యింద‌న్న `విశ్వ‌రూపం 2` ఇప్ప‌టికీ వెలుగు చూడ‌లేదు. ఆ త‌ర్వాత ప్రారంభించిన `శ‌భాష్ నాయుడు` (త‌మిళంలో శ‌భాష్ కుందు) చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఈ రెండు సినిమాలు ఎప్ప‌టికి రిలీజ‌వుతాయో తెలియ‌ని స‌న్నివేశం నెల‌కొంది. క‌మ‌ల్ హాస‌న్ ఓవైపు బుల్లితెర ఎంట్రీ ఇచ్చి, బిగ్ బాస్ సీజ‌న్ న‌డిపిస్తున్నాడు. మ‌రో వారంతో ఇది పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత అయినా ఈ సినిమాలు రిలీజ‌వుతాయా? అంటే దానికి క‌మ‌ల్ స‌మాధాన‌మిచ్చారు.

అవును.. విశ్వ‌రూపం 2, శ‌భాష్ కుందు చిత్రాల్ని రిలీజ్ చేస్తాను. నేను రాజ‌కీయాల్లో పూర్తి బిజీ కాక‌ముందే వాటిని రిలీజ్ చేస్తాన‌ని తెలిపారు. విశ్వ‌రూపం 2 ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇక శ‌భాష్ నాయుడు చిత్రం నాకు యాక్సిడెంట్ అవ్వ‌డం వ‌ల్ల ఆగింది. దానిని త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాను.. అని తెలిపాడు. 2018 లోపే ఈ రెండు చిత్రాల్ని రిలీజ్ చేస్తాన‌ని అన్నారు. ఒక‌సారి రాజ‌కీయాల్లోకి వెళ్లాక ఇక వెనుతిరిగి చూసే టైమ్ ఉండ‌ద‌ని, అంత‌కు ముందే వెండితెర‌, బుల్లితెర క‌మిట్‌మెంట్లు పూర్తి చేస్తాన‌ని క‌మ‌ల్ స్ప‌ష్టం చేశారు. సామాజిక బాధ్య‌త‌తో రాజ‌కీయాల్లోకొస్తున్నాన‌ని, ఓసారి బ‌రిలోకి దిగాక ఇక‌ సెల‌వు కానీ వాయిదా కానీ ఉండ‌దని క‌మ‌ల్ వ్యాఖ్యానించారు. 2019 పూర్తిగా ప్ర‌జ‌ల‌కోస‌మే కేటాయిస్తాన‌ని తెలిపారు. గాంధీ జ‌యంతికి రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌ల న‌డుమ అభిమానుల‌కు కాస్తంత ఊర‌ట‌నిచ్చే మాట చెప్పారు క‌మ‌ల్ సారు!

  •  
  •  
  •  
  •  

Comments