కమల్ యూ టర్న్ తీసుకున్నాడుగా ?

Friday, July 27th, 2018, 03:00:22 AM IST


జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ నటన గురించి ఇవ్వాళా మనం కొత్తగా చెప్పే పనిలేదు. ఎన్నో అద్భుత పాత్రల్లో జీవించిన కమల్ ఈ మద్యే కాస్త సినిమాల విషయంలో వివాదాల్లో పడ్డాడు. అటు సక్సెస్ రేట్ తగ్గడంతో అవకాశాలు రాలేదు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన విశ్వరూపం సినిమా పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ ని విడుదల చేసే పనిలో పడ్డాడు. మరో వైపు కమల్ ప్రాంతీయ పార్టీని కూడా సొంతంగా స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజని, కమల్ లు సినిమాలకు దూరం అయి రాజకీయాల్లోనే బిజీ అవుతారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక రజని కాంత్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా కూడా అయన పొలిటికల్ గా ఎంట్రీ విషయంలో అయోమయంలో ఉన్నాడు. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీగా మారడంకోసం సినిమాలు వదులుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ రెస్పాండ్ అయ్యాడు .. తానూ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా సినిమాలు చేయడం మాత్రం ఆపను అని చెప్పేసాడు. దాంతో ఒక్కసారిగా కమల్ అభిమానుల్లో ఆనందం నెలకొంది . నిజమే అలాంటి గొప్ప నటుడు ఇక సినిమాలు చేయనంటే ఎవరికైనా నిరాశే కదా !! కమల్ తాజాగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో నటించేందుకు రెడీ అయ్యాడు.

  •  
  •  
  •  
  •  

Comments