అపూర్వ స‌హోద‌రులు కాపీ కొట్ట‌లేదు!

Thursday, October 4th, 2018, 07:07:19 PM IST

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన అపూర్వ స‌హోద‌రులు చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ చిత్రంలో క‌మ‌ల్ అసాధార‌ణ న‌ట‌ప్ర‌తిభ‌ను మ‌ర్చిపోలేరు. ముఖ్య ంగా అందులో మేయ‌ర్ పాత్ర‌, మ‌రుగుజ్జు పాత్ర‌ల్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఆ మ‌రుగుజ్జు పాత్ర‌ను షారూక్ కాపీ చేశారా? జీరోపై వ‌చ్చిన విమ‌ర్శ‌లివి. వీటికి స‌మాధానం దొరికింది ఇప్ప‌టికి.

కింగ్ ఖాన్ షారూక్ న‌టిస్తున్న‌ జీరో 2018 డిసెంబ‌ర్‌లో రిలీజ‌వుతోంది. ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్ పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమావిశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ ఆరంభంలో న‌టించిన విచిత్ర స‌హోద‌రులు కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంద‌ని, ఇందులో మ‌రుగుజ్జు పాత్ర కాపీ అని ప్ర‌చార‌మైంది. క్లాసిక్ సినిమాని షారూక్ అంత పెద్ద స్టార్ కాపీ చేస్తున్నార‌న్న‌ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఇదే ప్ర‌శ్న ద‌ర్శ‌కుడు ఆనంద్ .ఎల్‌.రాయ్‌నే అడిగితే.. ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

ఆనంద్ ఎల్ రాయ్ మాట్లాడుతూ -“జీరో చిత్రాన్ని క‌మ‌ల్ హాస‌న్‌కి చూపిస్తాను. సౌత్ సినిమాకి కాపీ అన్న మాట‌లు నేను కూడా విన్నాను. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నా. షారూక్‌కి కూడా ఈ విష‌యాన్ని చెప్పాను. క‌మ‌ల్ హాస‌న్ అప్పు రాజా (హిందీ) త‌ర‌హా పాత్ర ఇద‌ని చ‌ర్చించుకున్నాం. అయినా క‌మ‌ల్ హాస‌న్ – షారూక్ ఇద్ద‌రూ స్నేహితులు. హే రామ్ చిత్రంలో ఆ ఇద్ద‌రూ క‌లిసే న‌టించారు అని తెలిపారు. క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన‌ `అపూర్వ స‌హోదరులు` ఓ డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక `అపూర్వ సహోదరగళ్`(1989) తమిళ చిత్రం. హిందీలో `అప్పూరాజా` గా రిలీజైంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ మ‌రుగుజ్జుగా, మేయ‌ర్ గా, యువ‌కుడిగా త్రిపాత్రాభినయం చేశాడు. అన్ని భాష‌ల్లో పెద్ద హిట్ట‌య్యింది. ప్ర‌స్తుతం ఆనంద్ ఎల్‌.రాయ్ తెర‌కెక్కిస్తున్న జీరో చిత్రంలో షారూక్ మ‌రుగుజ్జు పాత్ర‌పై విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు.