క‌మ్మ (X) కాపు: గెలిచేది కాపు పోరాట‌మా? బాబు తంత్రమా?

Tuesday, January 24th, 2017, 05:39:20 PM IST

chandrababu1
కాపులంతా ఏక‌మ‌య్యారు. ఇక చావో..రేవో తేల్చుకుందామ‌ని న‌డుంబిగించారు. దెబ్బ‌కు బాబు దిగిరావాలి. ఆయ‌న‌కు స‌పోర్టు చేస్తున్న వారంతా కూడా దిగిరావాల్సింది. దిక్కులు పిక్క‌టిల్లేలా మౌనంగానే పోరాట‌నికి దిగుతున్నారు కాపులంతా. ఇప్ప‌టికే స‌ర్వం సిద్దం చేశారు. కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అధ్య‌క్ష‌త‌న ఈనెల 25వ తేది నుంచి 30 వ‌ర‌కూ రావుల‌పాలెం నుంచి అంత‌ర్వేది వ‌ర‌కూ స‌త్యాగ్ర‌హ యాత్ర చేప‌ట్టాల‌ని కాపు జేఏసీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు సిద్ద‌మ‌య్యాయి. అయితే ఈ పోరాటాన్ని అణిచివేయాల‌ని ఏపీ సీఏం చంద్ర‌బాబు నాయుడు జోరుగా కుట్ర‌లు ప‌న్నుతున్నాడు. స‌త్యాగ్ర‌హానికి అనుమ‌తివివ్వ‌లేదు. కాపు ఉద్య‌మాన్ని ఉక్కు పాదంతో అణ‌గ‌దొక్కాల‌ని తంత్రాలు ప‌న్నుతున్నాడు. ఇప్ప‌టికే కిర్లం పూడిలో ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని ఆర్డ‌ర్ జారీ చేశాడు. మీడియాపైనా…పోలీసుల‌పైనా ఆంక్ష‌లు విధించారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న కాపులంతా రావుల పాలెం చేరుకోకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించాడు.

కాపోడి కాలు రావులపాలెంలో ప‌డ‌కూడ‌ద‌ని చెక్ పోస్ట్ ల‌ను పెట్టేసాడు. ఇదంతా బాబు ప్లానింగేన‌న్న‌ది అంద‌రికీ తెలుసు. కేవ‌లం ఆయ‌న వెన‌కుండి ఆడిస్తున్న గేమ్ పై కాపు నాయ‌కులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. బాబు ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా..ప‌క్క రాష్ట్రాల‌ నుంచి ఎన్ని ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ బ‌ల‌గాల‌ను రంగంలో కి దించినా కాపుల దెబ్బ‌కు అంద‌రూ దిగిరావాల్సిందేన‌ని కాపు కాపు నాయ‌కులు, యువ‌త బ‌లంగా సంక‌ల్పించారు. ఈ దెబ్బ‌కు బాబు కూర్చున్న పీఠం క‌దిలిపోతుంద‌ని కాపు యువ‌త గ‌ట్టిగా చెబుతోంది. అటు ప్ర‌తిప‌క్ష పార్టీలు కాపుల స‌త్య‌గ్ర‌హానికి పూర్తి మ‌ద్ద‌ను ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో బాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన‌ట్లేన‌ని అంతా భావిస్తున్నారు. మ‌రోవైపు జ‌న‌సేనాని నేతృత్వంలో వైజాగ్ బీచ్‌లో భారీ మౌన యుద్ధం మొద‌లు కానున్న నేప‌థ్యంలో అన్ని వైపుల నుంచి బాబును ముప్పిరిగొలిపే తంత్రం న‌డుస్తోంద‌ని భావించాల్సొస్తోంది.