నిన్న అలా నేడు ఇలా.. కంగ‌న బికినీ ట్రీట్‌ !

Tuesday, March 6th, 2018, 08:58:24 PM IST

కంగ‌న ర‌నౌత్ లోని విల‌క్ష‌ణ‌త గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితంలో కంగ‌న ఎంచుకున్న దారి ఎంతో విభిన్న‌మైన‌ది. ప్ర‌త్యేక‌మైన‌ది. అందుకే త‌న‌కంటూ ప్ర‌త్యేకించి వీరాభిమానులున్నారు. కంగ‌న డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ ఎంద‌రినో అభిమానులుగా మార్చింది. ఇక‌పోతే కంగ‌న ప్ర‌స్తుతం ఝాన్సీరాణి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి విదిత‌మే. వీర‌నారిగా ఖ‌డ్గం ఝ‌లిపిస్తోంది. ఇక‌పోతే ఈ సినిమా షూటింగులో ప్రాణాల‌మీదికి తెచ్చుకున్నాన‌ని కంగ‌న స్వ‌యంగా వెల్ల‌డించింది. చావు అంచుల వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చాన‌ని తెలిపింది.

ఝాన్సీ రాణిగా న‌టిస్తూనే కంగ‌న మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌యోగం చేసేందుకు తెర‌లేపింది. ఈసారి త‌న ఎంపిక మ‌రింత వైవిద్యంగానే ఉంది. ఈ సినిమా పేరు `మెంట‌ల్ హై క్యా`. రాజ్‌కుమార్ రావ్ క‌థానాయ‌కుడు. తెలుగు ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌నిక థిల్లాన్ క‌థ అందిస్తున్నారు. నిన్న‌నే మెల్ల‌క‌న్నుతో భ‌య‌పెట్టేస్తున్న కంగ‌న పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. నేడు సెకండ్ లుక్ అంటూ కంగ‌న బికినీ పిక్‌ని వ‌దిలారు. నిన్న‌టితో పోలిస్తే, నేడు పూర్తి కాంట్రాస్ట్‌గా క‌నిపించి షాకిచ్చింది ఈ భామ‌. బికినీలో వేడి పెంచుతున్న ఈ ఫోటో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. కంగ‌న ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తుందో?